- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెప్టెంబరు 15కల్లా శ్రీనివాస సేతు నిర్మాణ పనులు పూర్తి చేయాలి : టీటీడీ ఈవో
దిశ, డైనమిక్ బ్యూరో : సెప్టెంబరు 15కల్లా శ్రీనివాస సేతు నిర్మాణ పనులు పూర్తి చేయాలి అని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీనివాస సేతును సెప్టెంబరు 18న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. బుధవారం టీటీడీ పరిపాల భవనంలోని తన ఛాంబర్‌లో టీటీడీ, మున్సిపల్ అధికారులతో శ్రీనివాస సేతు నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ... శ్రీనివాస సేతు నిర్మాణ పనులు సెప్టెంబరు 15వ తేదీకి పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న సెంట్రల్ డివైడర్లు, కాలువలు, ఫుట్‌పాత్‌లు, వీధుల ఆధునీకరణ, పెయింటింగ్, క్రాష్ బ్యారియర్లు, బి.టి.రోడ్డు, సుందరీకరణ తదితర పనులను సెప్టెంబరు 15 నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ హరితను కోరారు. సెప్టెంబరు 12నుండి శ్రీనివాస సేతుపై ట్రైయల్ రన్ నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, మున్సిపల్ కమిషనర్ హరిత ,ఎఫ్ ఏ అండ్ సిఏఓ బాలాజీ, సిఈ నాగేశ్వరరావు, మున్సిపల్ ఎస్ఇ మోహన్, ఈఈ చంద్ర శేఖర్, ఆఫ్కాన్స్ ప్రాజెక్టు డైరెక్టర్ మురుగేషన్ తదితరులు పాల్గొన్నారు.