టీడీపీలోకి వలసలతో దద్దరిల్లుతున్న నియోజకవర్గం?

by Jakkula Mamatha |   ( Updated:2024-03-14 14:20:12.0  )
టీడీపీలోకి వలసలతో దద్దరిల్లుతున్న నియోజకవర్గం?
X

దిశ, కనిగిరి:నియోజకవర్గం పామూరు మండలం లో ఇప్పటికే భారీ సంఖ్యలో వైసీపీని వీడి టీడీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది.తాజాగా గురువారం పామూరు పట్టణం పసుపు మయం అయింది.పామూరు మండల టీడీపీ అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, ఫోర్ మెన్ కమిటీ సభ్యులు షేక్ గౌస్ బాషా, ఉప్పలపాటి హరిబాబు, పందిటి హరీష్, ఇర్రి కోటిరెడ్డి , ఎలక్షన్ కమిటీ చైర్మన్ డివి మనోహర్ సారధ్యంలో కనిగిరి టీడీపీ అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో పామూరు పట్టణంలో ఎంపీటీసీ ఆకుపాటి వెంకటేష్, పంచాయతీ వార్డు మెంబర్ నీరు కట్టు నాయబ్ రసూల్ ఆధ్వర్యంలో దాదాపు 100 కుటుంబాలు వైసీపీని వీడి TDPలో చేరాయి.

బైపాస్ నుంచి పువ్వాడి కన్వెన్షన్ హాల్ వరకు దాదాపు 500 మోటార్ సైకిల్ వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డికి రియల్టర్ ఆకుపాటి రమణయ్య, వెంకటేష్ భారీ గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం పువ్వాడి కన్వెన్షన్ హాలులో పార్టీలో చేరిన వారందరికీ ఉగ్ర నరసింహారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కనిగిరి నియోజకవర్గం అభివృద్ధి కి ఆనవాళ్లు అయిన వెలిగొండ ప్రాజెక్టు, నిమ్జ్, త్రిపుల్ ఐటీ, టిడిపి ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి టీడీపీ సీనియర్ నాయకులు నారపుశెట్టి పాపారావు, టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Read More..

కాపులు అవసరం టీడీపీకి లేదా: ప్రగడ నాగేశ్వరరావు

Next Story

Most Viewed