YS Sharmila : షర్మిలకు భద్రత పెంచాలని డీజీపీకి కాంగ్రెస్ నేతల వినతి

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-30 10:52:20.0  )
YS Sharmila : షర్మిలకు భద్రత పెంచాలని డీజీపీకి కాంగ్రెస్ నేతల వినతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్. షర్మిల(YS Sharmila) కు భద్రత పెంచాలని(increase security) డీజీపీ(DGP)కి కాంగ్రెస్ నేతలు వినతి పత్రం అందించారు. తన అన్న..ఏపీ మాజీ సీఎం వైఎస్.జగన్(YS Jagan)తో నెలకొన్న ఆస్తి వివాదం నేపధ్యంలో షర్మిలకు భద్రత పెంచాలని వారు కోరడం గమనార్హం. షర్మిలకి ప్రస్తుతం ఉన్న 2+2 గన్ మెన్స్ కాకుండా 4+4 గన్ మెన్లను ఇవ్వాలంటూ డీజీపీకి ఇచ్చిన వినతి పత్రంలో ఏపీ కాంగ్రెస్ నేతలు కోరారు. ఇప్పటికే అన్నా చెల్లెళ్లు జగన్, షర్మిలల మధ్య సాగుతోన్న ఆస్తి వివాదంలో రోజుకో మలుపు తిరుగుతోంది.

షర్మిలకు ఎంవోయు మేరకు జగన్ ఇస్తానన్న ఆస్తులు ఇవ్వడానికి నిరాకరించి, కోర్టుకు ఎక్కగా, వైఎస్ షర్మిల ఆస్తుల పంపకంలో జగన్ తీరును తప్పుబడుతూ రోజుకో స్టేట్ మెంట్ తో ఫైర్ అవుతున్నారు. మధ్యలో వైఎస్.విజయమ్మ లేఖ, తదుపరి వైసీపీ లేఖలతో ఈ వ్యవహారం మరింత రచ్చగా మారింది. అయితే సీబీఐ కేసుల్లో జగన్ బెయిల్ రద్దు చేసే కుట్రలో భాగంగానే షర్మిల ఇదంతా చేస్తున్నారని వైసీపీ ఆరోపించగా, ఆ పార్టీ ఆరోపణలు శతాబ్ధపు జోక్ అంటూ షర్మిల కొట్టిపారేశారు.

Advertisement

Next Story

Most Viewed

    null