Breaking: మోడీ సభలో భద్రతా వైఫల్యం.. పల్నాడు ఎస్పీపై ఫిర్యాదు

by srinivas |   ( Updated:2024-03-18 13:49:58.0  )
Breaking: మోడీ సభలో భద్రతా వైఫల్యం.. పల్నాడు ఎస్పీపై ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: చిలకలూరిపేట బొప్పూడిలో ప్రజాగళం సభ జరిగింది. ఈ సభలో మోడీ ప్రసంగిస్తుండగా పవర్ కట్ అయింది. అంతేకాకుండా సభకు బ్లాంక్ పాసులు జారీ చేశారు. దీంతో భద్రతా వైఫల్యం జరిగినట్లు టీడీపీ, టీడీపీ, జనసేన నేతలు అనుమానించారు. ఎన్నికల సంఘం అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. మోడీ సభలో భద్రతా వైఫల్యం బయటపడిందని.. అందుకు కారణం పల్నాడు జిల్లా ఎస్పీ తీరునేనని ఫిర్యాదులో ఎన్డీయే నేతలు ఆరోపించారు. సభకు సంబంధించి ముందుగానే పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డికి సమాచారం అందించామని తెలిపారు. ఈ నెల 12నే లేఖ రాశామని పేర్కొన్నారు. కానీ ఆదివారం జరిగిన సభలో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించలేదని తెలిపారు. సభను భగ్నం చేయాలనే ఉద్దేశంతోనే వైసీపీ కార్యకర్తలాగా ఎస్పీ రవిశంకర్ రెడ్డి వ్యవహరించారని పేర్కొన్నారు. సభలో మోడీ పవర్ కట్ అయిన విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. నలుగురు పోలీసు అధికారులపై ఆధారాలు అందజేశామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలు సజావుగా జరగాలంటే ఆ నలుగురుని విధుల నుంచి తప్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు ఎన్డీయే నేతలు తెలిపారు.

Read More..

AP: నిరుద్యోగులకు బంపర్ న్యూస్.. మెగా జాబ్‌ మేళాలో రేపే ఇంటర్వ్యూలు ప్రారంభం!

Advertisement

Next Story