ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం వైఎస్ జగన్.. ఎవరెవరితో భేటీ అవుతారంటే..?

by Nagaya |   ( Updated:2023-07-05 08:53:10.0  )
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం వైఎస్ జగన్.. ఎవరెవరితో భేటీ అవుతారంటే..?
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హస్తిన పర్యటనకు బయలుదేరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి వెళ్లారు. మధ్యాహ్నం ఢిల్లీలోని జనపథ్‌-1 నివాసానికి చేరుకుంటారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్ బిజీగా గడపనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ కానున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని నరేంద్రమోడీతో జగన్ భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించనున్నారు.

Read more : KVP on Daggubati Purandeswari: పురంధేశ్వరిని చూస్తే జాలేస్తోంది

Advertisement

Next Story