- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం సర్.. కరుణించండి! 2018 గ్రూప్-1 అభ్యర్థుల వేడుకోలు
దిశ, ఏపీ బ్యూరో: ఏపీపీఎస్సీ 2018 గ్రూప్-1 ఎంపికల్లో జరిగిన అవకతవకలు, అవినీతిపై ఆనాడు ప్రతిపక్షంలో ఉండి, సింగిల్ బెంచ్ తీర్పును తప్పకుండా అమలు చేస్తామని చెప్పిన మాటను వాస్తవం చెయ్యాలని 2018 గ్రూప్-1 అభ్యర్థులు సీఎం చంద్రబాబును కోరుతున్నారు. ఏపీపీఎస్సీ 2018 గ్రూప్-1 ఎంపికల్లో జరిగిన అవకతకలు, అవినీతిపై హైకోర్టులో పలు పిటిషన్ల అనంతరం 2024 మార్చి 13న హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేయాలని అభ్యర్థులు మొరపెట్టుకుంటున్నారు.
ఈ ఏడాది మార్చి 15న ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు కోర్టు తీర్పును సమర్థిస్తూ అభ్యర్థులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని, ప్రభుత్వం వచ్చి 5 నెలలు గడుస్తున్నా తుది నిర్ణయం తీసుకోలేదని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పులను సరిచేస్తూ కూటమి ప్రభుత్వంలో న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. 6 నెలల్లో ప్రక్రియ పూర్తిచేసి గ్రూప్స్ మెయిన్స్ రీ-ఎగ్జామినేషన్‌ను నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలను అమలు చేసి ఇచ్చిన హామీ నెరవేర్చాలని ఎదురుచూస్తున్నారు.
అసలు జరిగిందేంటంటే..
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ 31 డిసెంబర్ 2018న విడుదలైంది. మే 2019లో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించి, సెప్టెంబర్ 2019లో ఫలితాలను ప్రకటించారు. కొవిడ్ లాక్‌డౌన్ అనంతరం మెయిన్స్ (డిస్క్రిప్టివ్) పరీక్షను డిసెంబర్ 2020లో నిర్వహించి, డిజిటల్ (పేపర్లు స్కాన్ చేసి, టాబ్స్ ద్వారా డిజిటల్ రూపంలో) మూల్యాంకనం చేసి ఫలితాలు మార్చి 2021లో ప్రకటించబడ్డాయి. అదేసమయంలో కోర్టు మునుపటి ఫలితాన్ని పక్కన పెట్టి మాన్యువల్ మూల్యాంకనం జరపాలని ఆదేశించింది. మే 2022లో కొత్త ఇంటర్వ్యూ జాబితాను విడుదల చేసింది.
ఇంటర్వ్యూలు నిర్వహించి, 5 జూలై 2022న తుది ఫలితాలు ప్రకటించారు. 2022లో రెండు మాన్యువల్ మూల్యాంకనాలు జరిగాయని, 2022కి సంబంధించిన మొదటిసారి చేసిన మాన్యువల్ ఎవాల్యూషన్‌లో ఎంపిక అయిన అభ్యర్థుల జాబితాను పక్కన పెట్టి మూడోసారి మరలా కొత్తగా మాన్యువల్‌గా ఎవాల్యూషన్ చేసి, మొదటసారి మాన్యువల్ ఎవాల్యూషన్ రిజల్ట్స్ ను తొక్కిపెట్టారని అన్ని ఆధారాలతో బాధిత అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న వివిధ రిట్ పిటిషన్‌ల తుది ఫలితాలకు వారి నియామకం లోబడి ఉంటుందని హామీని సమర్పించడం ద్వారా ఎంపికైన అభ్యర్థులందరినీ సేవల్లో చేరడానికి హైకోర్టు అనుమతించినట్లు సమాచారం. సుమారు ఒకటిన్నర సంవత్సరం విచారణ తర్వాత హైకోర్టు మెయిన్స్ రీ-ఎగ్జామినేషన్‌ను నిర్వహించాలని ఆదేశించింది. ఆదేశాల్లో 6 నెలల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించినట్లు సమాచారం.
ఆ ఇద్దరు అధికారులే సూత్రధారులు?
గత అసెంబ్లీ సమావేశంలో ఇదే అంశంపై వాడివేడిగా చర్చ జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ పరీక్షలపై అంశాన్ని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి లేవనెత్తారు. ఏపీపీఎస్సీకి మాజీ డీజీ గౌతం సవాంగ్, పీఎస్ఆర్ ఆంజనేయులు ఇద్దరూ కలిసి ఇష్టం వచ్చిన వాళ్ళను ఎంపిక చేశారని ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర అన్నారు. ఏపీపీఎస్సీ నిబద్ధతపై కూడా సందేహాలు ఉన్నాయన్నారు. మాన్యువల్ వెరిఫికేషన్ జరిగినప్పుడు అవకతవకలు జరిగాయన్నారు. సీనియర్ ఆఫీసర్ల పాత్ర ఉండటంతో దీనిపై సీబీఐ ఎంక్వైరీ జరగాల్సిందే అని పట్టుబట్టారు.
ఏపీపీఎస్సీని సొంత జాగీరుగా వాడుకున్నారని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి లోకేశ్ ఒక విచారణ కమిటీ నియమించారన్నారు. దీనిపై ఇప్పటికే అధికారులు విచారణ చేపట్టారని మంత్రి పయ్యావుల వెల్లడించారు. కమిటీ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణకు ఆదేశం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని కేశవ్ తెలిపారు. రిపోర్ట్ వచ్చిన తరువాత సభ్యులు కోరిన విధంగా సీఎం ఆదేశాలు తీసుకుని సీబీఐ ఎంక్వైరీకి సిఫార్సు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.
అక్రమాల్లో పెద్దల పాత్ర...
గ్రూప్-1 పరీక్షలో అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. అక్రమాల్లో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని ఆరోపించారు. ఐపీఎస్‌లు సీతారామాంజనేయులు, గౌతమ్ సవాంగ్‌పై కేసు నమోదు చేయాలన్నారు. ఏపీపీఎస్సీని వైసీపీ కార్యాలయంగా మార్చేశారని, కమిషన్ పెద్దలు కోర్టును సైతం మోసం చేయాలనుకున్నారని అన్నారు.
ఏపీపీఎస్సీ చైర్మన్‌ల మార్పు..
కూటమి ప్రభుత్వ హయాంలో నూతన చైర్మన్‌గా అనురాధ నియామకం కావడంతో అభ్యర్థులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. సీన్సియర్ అధికారిగా పేరు గాంచిన చైర్మన్ అనురాధ ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో న్యాయం జరుగుతుందని బాధితులు ఎదురుచూస్తున్నారు. ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని, విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని బాధితులు వేడుకొంటున్నారు. గ్రూప్స్ పరీక్ష నిర్వహించి బాధితులకు తగిన న్యాయం చేయాలని, సీఎం చంద్రబాబు హామీ అమలు చేయాలని వారు కోరుతున్నారు.