- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పిఠాపురంలో CM జగన్ సంచలన ప్రకటన.. వంగా గీతకు డిప్యూటీ సీఎం
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే రాబోయే వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. పవన్ కల్యా్ణ్ గెలిపిస్తే పిఠాపురంలో ఉండరు అని కీలక వ్యాఖ్యలు చేశారు. గెలిచినా ఓడినా ఆయన హైదరాబాద్‌లోనే ఉంటారు.. కానీ, ఇక్కడ మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండేది వంగా గీతనే అన్నారు.
పిఠాపురం అభివృద్ధి గీతతోనే సాధ్యమని తెలిపారు. ఐదోళ్లకోసారి కార్లు మార్చినట్లు పవన్ కల్యాణ్ భార్యలను మార్చుతారని విమర్శిచారు. ఇలాంటి వ్యక్తిని నమ్మి మహిళలు ఓట్లు వేస్తారా? అని ప్రశ్నించారు. ఒకసారి చేస్తే పొరపాటు.. రెండోసారి చేస్తే గ్రహపాటు.. మూడోసారి చేస్తే అది అలవాటు అని తీవ్ర విమర్శలు చేశారు. కాగా, కాసేపట్లో ప్రచారం ముగియనుండగా.. ఫైనల్ టచ్ ఇచ్చేందుకు జగన్ పిఠాపురంలో పర్యటించారు. మొత్తం ఇవాళ మూడు నియోజకవర్గాల్లో జగన్ పర్యటించారు. ఉదయం 10 గంటలకు చిలకలూరిపేట నియోజకవర్గంలో, మధ్యాహ్నం 12.30కు కైకలూరులో వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వర్‌రావు తరపున ప్రచారంలో, చివరగా మధ్యాహ్నం 3 గంటల నుంచి పిఠాపురంలో క్యాంపెయింగ్ చేసి అక్కడే ముగించారు.