- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఉద్యోగులకు సీఎం జగన్ తీపికబురు : ఉచిత వసతి పొడిగింపు
దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వచ్చి విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీపి కబురు చెప్పారు. అమరావతి ప్రాంతానికి వచ్చి పనిచేస్తున్న ఉద్యోగుల ఉచిత వసతి సదుపాయాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 జూన్ నుంచి 2024 జూన్ నెలాఖరు వరకు ఉచిత వసతి సదుపాయాన్ని పొడిగిస్తున్నట్టు జీఏడీ తమ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీ సచివాలయం, శాసనసభ, హెచ్‌ఓడీ కార్యాలయాలు, హైకోర్టు, రాజ్‌భవన్ ఉద్యోగులకు మాత్రమే ఈ పొడిగింపు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇకపోతే రాష్ట్ర విభజన అనంతరం ఏపీ రాజధానిని అమరావతికి తరలించారు. దీంతో హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు అమరావతికి తరలివచ్చారు. అయితే విధుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో నాటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చి.. సచివాలయ శాఖల ప్రధాన కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఉచిత వసతి కల్పించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ఉద్యయోగులకు ఉచిత వసతి సౌకర్యం కల్పించారు. అనంతరం 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధానాన్ని అనుసరిస్తుంది. గతంలో ఉద్యోగులకు ఉచిత వసతి సౌకర్యాన్ని రద్దు చేస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఉద్యోగుల విజ్ఞప్తితో ఉచిత వసతిని మళ్లీ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా మరోసారి వచ్చే ఏడాది జూన్ వరకు ఉచిత వసతిని పొడిగిస్తూ జీఏడీ ఉత్తర్వులు జారీ చేసింది.