- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ టూర్.. తిరిగి అమరావతికి..
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న జగన్.. తిరిగి శనివారం ఉదయం అమరావతికి బయల్ధేరారు. ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న జగన్.. అక్కడ నుంచి నేరుగా తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో జగన్ భేటీ అయ్యారు.
గురువారం మధ్యాహ్నం నిర్మలా సీతారామన్‌తో జగన్ భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, కేంద్రం నుంచి అందాల్సిన నిధుల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఇక శుక్రవారం రాత్రి అమిత్ షాను జగన్ కలిశారు. దాదాపు గంటపాటు ఇరువురి సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు, చంద్రబాబు అరెస్ట్ గురించి చర్చించినట్లు సమాచారం. చంద్రబాబు అరెస్ట్ గురించి అమిత్ షా ఆరా తీసినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అలాగే పోలవరంకు నిధులు విడుదల చేయాల్సిందిగా అమిత్ షాను జగన్ కోరారు.
చంద్రబాబు అరెస్ట్ క్రమంలో జగన్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ పాత్ర ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. టీడీపీ నేతలు బయటకు చెప్పకపోయినప్పటికీ.. బీజేపీ పాత్ర ఉందని అనుమానిస్తున్నారు. బీజేపీ హస్తం లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేసేంత ధైర్యం జగన్ చేయరని అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.