- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Cm Jagan: ఎస్ఈబీ, ఎక్సైజ్‌శాఖపై సమీక్ష.. అధికారులకు ఆదేశాలు

X
దిశ వెబ్ డెస్క్: దేశంలోనే గంజాయి సరఫరాలో ఏపీ తొలిస్థానంలో ఉందని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో గంజాయి సరఫరా, మద్యంపై ఏపీ సీఎం జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులను సమాయత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, ఎక్సైజ్ శాఖపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పోలీస్, ఎక్సైజ్ ఎస్ఈబీ పూర్తి సమన్వయంతో పని చేయాలన్నారు. నార్కోటిక్ రహిత రాష్ట్రంగా మార్చాలని అధికారులకు జగన్ సూచించారు. అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలని తెలిపారు. ఎక్కడా గంజాయి సాగు జరగకుండా చూడాలని ఆదేశించారు. గంజాయి సాగు చేసేవారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.
Next Story