మీ జయంతి మాకు పండుగ రోజు.. సీఎం జగన్ ఎమోషనల్

by GSrikanth |   ( Updated:2023-07-08 12:46:19.0  )
మీ జయంతి మాకు పండుగ రోజు.. సీఎం జగన్ ఎమోషనల్
X

దిశ, వెబ్‌డెస్క్: దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ తండ్రిని స్మరించుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రతి ఇంట్లో గొప్ప చదువులు చదవాలని, సుఖసంతోషాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని మీరు నిరంతరం తపించారు నాన్నా. అదే ప్రజలందరి హృదయాల్లో మీ స్థానాన్ని సుస్థిరంచేసింది. ఆ ఆశయాల సాధనలో మీ స్ఫూర్తి నన్ను ప్రతిక్షణం చేయిపట్టి నడిపిస్తోంది. మీ జయంతి మాకందరికీ ఒక పండుగ రోజు.’ అంటూ ట్విట్టర్ వేదికగా తండ్రి వైఎస్‌ఆర్‌కు ఘన నివాళులు అర్పించారు. అంతేగాక, కాసేపట్లో కడప జిల్లాలోని ఇడుపాయలలో వైఎస్సార్‌ ఘాట్‌ను కుటుంబసభ్యులతో కలిసి సందర్శించనున్నారు.

Also Read: నేడు వై.యస్.రాజశేఖరరెడ్డి పుట్టినరోజు

Advertisement

Next Story

Most Viewed