Cm Jagan: ఆదాయాన్నిచ్చే శాఖలపై కీలక అదేశాలు

by srinivas |
Cm Jagan: ఆదాయాన్నిచ్చే శాఖలపై కీలక అదేశాలు
X

దిశ, ఏపీ బ్యూరో: కోవిడ్‌ పరిస్థితులను దాటుకుని ఆదాయాలు గాడిలో పడుతున్నాయని, లక్ష్యాలకు దగ్గరగా ఆదాయాలు ఉన్నాయని ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అధికారులు తెలిపారు. ఆదాయాన్నిచ్చే శాఖలపై సీఎం జగన్ క్యాంపు కార్యాల‌యంలో స‌మీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ 2022 వరకూ జీఎస్టీ గ్రాస్‌ వసూళ్లలో దేశ సగటు 24.8 శాతం ఉందని తెలిపారు. ఏపీలో వసూళ్లు 26.2 శాతం తెలంగాణ(17.3శాతం), తమిళనాడు(24.9 శాతం), గుజరాత్‌(20.2శాతం) కన్నా మెరుగైన వసూళ్లు ఉన్నట్టుగా జగన్‌కు అధికారుల వెల్లడించారు. జీఎస్టీ వసూళ్లు 2022 జనవరి నాటికి రూ. 26,360.28 కోట్లు ఉంటే 2023 జనవరి నాటికి రూ. 28,181.86 కోట్లు వసూళ్లు వచ్చాయని, గత ఏడాది ఇదే కాలపరిమితితో పోల్చుకుంటే 6.91 శాతం పెరుగుదల కనిపించిందని జగన్‌కు అధికారులు వివరించారు. జీఎస్టీ, పెట్రోలు, ప్రొఫెషనల్‌ ట్యాక్స్, ఎక్సైజ్‌ ఆదాయాలను కలిపి చూస్తే జనవరి 2023 నాటికి ఆదాయాల లక్ష్యం రూ. 46,231 కోట్లు కాగా రూ.43,206.03 కోట్లకు చేరుకున్నామని వెల్లడించారు. దాదాపు 94 శాతం లక్ష్యాన్ని సాధించినట్టుగా తెలిపారు. గతంలో సీఎం ఇచ్చిన ఆదేశం మేరకు పన్ను వసూలు యంత్రాంగంలో కీలక మార్పులు తీసుకువచ్చామని అధికారులు తెలిపారు.

అనంతరం జగన్ మాట్లాడుతూ ఏపీ కన్నా మెరుగైన పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో విధానాలను అధికారులు అధ్యయనం చేయాలని సూచించారు. తద్వారా మంచి విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలన్నారు.

ఎర్రచందనం విక్కయానికి చర్యలు తీసుకున్నాం

గనులు, ఖనిజ శాఖలో ఈ ఆర్ధిక సంవత్సరంలో ఫిబ్రవరి 6 వరకూ రూ. 3,649 కోట్ల ఆర్జన కాగా.. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని నూటికి నూరుశాతం చేరుకున్నామని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి 6 నాటికి రూ.2,220 కోట్ల ఆర్జన కాగా నిర్దేశించుకున్న రూ.5వేల కోట్ల ఆదాయ లక్ష్యాన్ని దాదాపుగా చేరుకున్నామని పేర్కొన్నారు. ఆపరేషన్‌లో లేని గనులను ఆపరేషన్‌లోకి తీసుకొచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.. రవాణా శాఖలో ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి లక్ష్యంగా రూ. 3,852.93 కోట్లు కాగా, రూ.3,657.89 కోట్లకు చేరుకున్నామని వివరించారు. కోవిడ్‌ లాంటి పరిస్థితులు పూర్తిగా పోయి నెమ్మదిగా గాడిలో పడుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న ఎర్రచందనం నిల్వలను విక్రయించడానికి అన్నిరకాల చర్యలు తీసుకున్నామని, మూడు దశల్లో విక్రయానికి అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Cm Jagan ఎటైనా వెళ్లొచ్చు.. ఎంపీ రఘురామ సెటైర్

Next Story

Most Viewed