- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అరమరికలు పక్కనపెట్టి మేనల్లుడి నిశ్చితార్థానికి సీఎం జగన్
దిశ వెబ్ డెస్క్: వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజా రెడ్డి వివాహం అట్లూరి ప్రియతో జరగనున్న విషయం అందరికీ సుపరిచితమే. కాగా వివాహం ఫ్రిబ్రవరి 17 వ తేదీన జరిపించేలా ముహూర్తం ఖరారు చేశారు. అయితే వివాహానికి ముందు జరిగే నిశ్చయ తాంబూలాల వేడుక నిశ్చితార్ధం జనవరి 18 వ తేదీన హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బంధుమిత్రులతో పాటు పలువురు ప్రముఖులను కూడా వైయస్ షర్మిల దంపతులు ఆహ్వానించారు. సోదరుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటుగా తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యంత్రి నారా చంద్రబాబు నాయుడు కి కూడ ఆహ్వానం అందింది.
ఈ నేపథ్యంలో ఈ రోజు జరగనున్న నిశ్చితార్ధ వేడుకకు వైఎస్ షర్మిల సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేయనున్నారని సమాచారం. అలానే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, అలానే ఆయన తనయుడు నారా లోకేష్ కూడా వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి హాజరవుతున్నట్లు సమాచారం. కాగా రాజా రెడ్డి-ప్రియల వివాహం జోధ్‌పూర్‌లో ఫిబ్రవరి 17 వ తేదీన జరగనుంది. ఇక వివాహానంతర జరిగే రిసెప్షన్‌ను ఫిబ్రవరి 24 వ తేదీన హైదరాబాద్ లోని శంషాబాద్ ఫోర్ట్ గ్రాండ్‌లో వైఎస్ఆర్ కుటుంబం ఏర్పాటు చేసింది.