AP Politics: చిరంజీవిని, రాజమౌళిని అవమానించిన సీఎం జగన్..

by Indraja |   ( Updated:2024-04-12 16:19:29.0  )
AP Politics: చిరంజీవిని, రాజమౌళిని అవమానించిన సీఎం జగన్..
X

దిశ వెబ్ డెస్క్: వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. సినీ ఇండస్ట్రీని అవమానించిన సంస్కారహీనుడు సీఎం జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిత్రసీమలో రారాజుగా వెలుగొంది, మెగాస్టార్‌గా పేరుగాంచి, పద్మవిభూషణ్ బిరుదు గాంచిన చిరంజీవికి జగన్మోహన్ రెడ్డికి పోలిక ఉందా..?అని ఎద్దేవ చేశారు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన దర్శక దిగ్గజం రాజమౌళిని, హీరోలను ఇంటికి పిలిచి అవమానించిన అంహంకారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.

పవన్‌కళ్యాణ్ సినిమాలకు రేట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని చంద్రబాబు ధ్వజమెత్తారు. సినిమాలు ఆడాలంటే తనకి ఊడిగం చెయ్యాలని చెప్పే వ్యక్తి జగన్ అని ఆయన మండిపడ్డారు. శునకాన్ని సింహాసనంపై కూర్చోపెడితే ఇలాగే ఉంటుంది అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More..

AP Politics:గుర్తులతో గజిబిజి..గ్లాసుకు తలనొప్పిగా మారిన బకెట్?

Advertisement

Next Story