- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CM Jagan : వారికి కోసం 97.76 కోట్ల రూపాయలు కేటాయింపు.. నేడే ఖాతాల్లోకి సొమ్ము జమ
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల లభ్ది అందని వారికి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి శుభవార్తను చెప్పారు. సంక్షేమ పథకాలు అందించే లభ్ది పొందే అర్హత కలిగి ఉండి ఏదైన కారణం చేత లభ్ది పొందని వారికి మరో అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. వివరాలలోకి వెళ్తే.. ప్రతి సంవత్సరం జనవరి- జూన్, అలానే జూలై- డిసెంబర్ వరకు ఇలా రెండు పర్యాయాలు సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదును అర్హులైన వారికి అందిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఆగస్టు- డిసెంబర్, 2023 మధ్య అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి లభ్ది పొందని వారికి శుభవార్తను చెప్పారు జగన్.
లభ్ది పొందేందుకు అర్హత కలిగి ఉండి ఏదైన అనివార్య కారణాల వల్ల లభ్ది పొందలేక పోయిన వారికి మరో అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల లభ్ది అందని 68,990 మంది అర్హులకు లబ్ధి చేకూర్చాలని సీఎం నిర్ణయించారు. వారి కోసం 97.76 కోట్ల రూపాయలను కేటాయించనున్నారు. ఈ రోజు తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి వర్చువల్ గా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమచేయనున్నారు. దీనితో 68,990 మంది అర్హుల ఖాతా లోకి ఈ రోజే నగదు జమ కానుంది.