- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: ఎన్నికల క్షేత్రంలోకి సీఎం జగన్.. ముహూర్తం ఫిక్స్
దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ మోమన్ రెడ్డి ఎన్నికల క్షేత్రంలోకి వెళ్లనున్నారు. సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 25 నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఉత్తరాంధ్ర నుంచి ఈ పర్యటనను ప్రారంభించనున్నారు. రోజుకు రెండు జిల్లాల చొప్పున పర్యటించానున్నారు. ఈ పర్యటనలో తమ ప్రభుత్వం ఏం చేసిందనేది, వచ్చే ఎన్నికల్లో తాము గెలిస్తే ఏం చేస్తామనే విషయాలను వివరించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకునేలా జిల్లాల నాయకులకు ఇప్పటికే సమాచారం పంపారు. అటు పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.
వచ్చే ఎన్నికలపై ఫోకస్ పెట్టిన సీఎం వైనాట్ 175 అంటున్నారు. ఇందులో భాగంగా చాలా నియోజకవర్గాల్లో ఇంచార్జులను మార్చారు. 60 నియోజకవర్గాలకు పైగా కొత్త ఇంచార్జులను నియమించారు. అలాగే ఆరు లోక్ సభ నియోజకవర్గాలకు సైతం ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశారు. మిగిలిన నియోజకవర్గాలపైనా ఆయన దృష్టి పెట్టారు. ఇప్పటికే మూడు లిస్టులను విడుదల చేశారు. పలువురికి సీట్లు నిరాకరించారు. తాజాగా మరో లిస్టుపైనా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత నాలుగో జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే నాలుగో లిస్టులో ఎవరు పేరు ఉంటుందో..ఎవరి పేరు ఉండదోనని మిగిలిన ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది. ఏం జరుగుతుందో చూడాలి.