- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
20 ఏళ్ల కల.. చరిత్ర సృష్టించిన సీఎం జగన్
దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ చరిత్ర సృష్టించారు. మూడు జిల్లాల ప్రజల 20 ఏళ్ల కల సాకారం చేశారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు సమీపంలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ఆయన జాతికి అంకితం చేశారు. ప్రకాశం, నెల్లూరు, వెఎస్సార్ కడప జిల్లాల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు నిర్మించిన వెలిగొండ ప్రాజెక్టులోని రెండో టన్నెల్‌ను బుధవారం సీఎం జగన్ ప్రారంభించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు జిల్లాలకు నీళ్లు ఇచ్చేందుకు వెలిగొండ ప్రాజక్టులో భాగమైన నల్లమల్లసాగర్‌కు సీఎం జగన్ కృష్ణా జలాలను తీసుకొచ్చారు. ఈ జలాలను తరలించేందుకు వీలుగా తొలి టన్నెల్‌ను జనవరి 13న నిర్మించారు. రెండో టన్నెల్ తవ్వకం పనులు జనవరి 21, 2024నాటి పూర్తి చేయించారు. తాజాగా ఈ జంట సొరంగాలను బుధవారం సీఎం జగన్ జాతికి అంకితం చేశారు.
వచ్చే సీజన్‌లో కృష్ణా వరద జలాలు శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల చేరుకున్న తర్వాత వెలిగొండ జంట సొరంగాల ద్వారా నల్లమల్లసాగర్‌కు నీటిని విడుదల చేస్తారు. తద్వారా తీగలేరు, గొట్టిపడియ, తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు. 15.25 లక్షల మందికి తాగు నీరు అందనుంది. అంతేకాదు ఆ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఫ్లోరైడ్ సమస్యకు చెక్ పెట్టారు. ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన నీటిపారుదల సొరంగాలను రికార్డు సమయంలో పూర్తి చేసి సీఎం జగన్ చరిత్ర సృష్టంచారని సాగునీటిరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు.