ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం.. ఒకే రోజు రంగంలోకి బాబు, జగన్

by Satheesh |
ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం.. ఒకే రోజు రంగంలోకి బాబు, జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఇవాళ్టి నుండి రాష్ట్రంలో రాజకీయం మరో లెవల్‌కు వెళ్లనుంది. నిన్నటి వరకు పొత్తుల వ్యవహారం, అభ్యర్థుల ఎంపిక, అసంతృప్తుల బుజ్జగింపులతో బిజీగా ఉన్న బాబు, జగన్ ఇక నేరుగా రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. సార్వత్రిక షెడ్యూల్ విడుదల కావడంతో అధికారమే లక్ష్యంగా సీఎం జగన్, బాబు స్పీడ్ పెంచారు. బుధవారం నుండి టీడీపీ, వైసీపీ పార్టీల అధినేతలు ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇడుపులపాయ నుంచి జగన్, పలమనేరు నుంచి బాబు ప్రచారం ప్రారంభించనున్నారు. 'మేమంతా సిద్ధం' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా జగన్ బస్సు యాత్రకు బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.

ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సాగనున్న ఈ బస్సు యాత్ర.. మొత్తం 21 రోజుల పాటు సాగనుంది. ఇవాళ్టి నుండి ప్రజాగళం పేరుతో చంద్రబాబు సభలు, రోడ్‌షోలు చేసేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా ఇవాళ పలమనేరు, పుత్తూరు, మదనపల్లిలో బాబు పర్యటించనున్నారు. ప్రతిరోజు 4 నియోజకవర్గాల్లో చంద్రబాబు సభలు ఉండనున్నాయి. ఇటు జగన్, అటు బాబు ఇద్దరూ ఒకే రోజు ఎన్నికల ప్రచారం ప్రారంభించడం ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌‌గా మారింది.


Advertisement

Next Story