రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

by Jakkula Mamatha |
రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
X

దిశ,వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లాలో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో తాజాగా మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ కలచివేసింది. గార్లదిన్నె మండలం కలగాసుపల్లె వద్ద ఆర్టీసీ బస్సు 12 మంది కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలో ఇద్దరు, ఆస్పత్రిలో ఐదుగురు మరణించారు. ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) స్పందించారు. ఈ ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్ర‌మాద‌ ఘటనలో ఏడుగురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం పై ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

Advertisement

Next Story