Heavy Rains:ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

by Jakkula Mamatha |
Heavy Rains:ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రాన్ని మరోసారి వానలు ముంచెత్తాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో(Andra Pradesh) ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం పొంచి ఉన్నదని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు.

నెల్లూరు జిల్లా తడ సమీపంలో వాయుగుండం తీరం దాటింది. ఈ ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మరో 24 గంటలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(Department of Meteorology) వెల్లడించింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇప్పటికే వర్షాలు భారీగా కురుస్తున్న జిల్లాల్లో సహాయక చర్యల గురించి చంద్రబాబు ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ముఖ్యమంత్రికి వివరించారు.

ఆ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains) పడినట్లు అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లాలోని పలు మండలాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం(rainfall) నమోదైంది. జిల్లాలోని వరికుంటపాడు మండలం, కనియంపాడులో పిల్లా పేరు వాగు పొంగి పొర్లుతోంది. దీంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో సాగునీటి ప్రాజెక్టు(Irrigation project)ల్లో నీటి ప్రవాహాలు, చెరువులు, వాగుల పరిస్థితి పై అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed