AP News:ఈ నెల 5న కలెక్టర్ల కాన్ఫరెన్స్..పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు ఫోకస్

by Jakkula Mamatha |
AP News:ఈ నెల 5న కలెక్టర్ల కాన్ఫరెన్స్..పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు ఫోకస్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అయితే సీఎం చంద్రబాబు ఇప్పటికే పలు అంశాలపై సమీక్ష సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ మేరకు తాజాగా సీఎం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 5వ తేదీన ఈ మీటింగ్‌కు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశంలో శాంతి భద్రతలు, గంజాయి నిర్మూలనపై సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో భూములు, ఇసుక, సహజ వనరుల దోపిడీ జరిగినట్లు గుర్తించామని చెబుతున్న సీఎం ఈ అంశాలపై ఫోకస్ పెడుతారని తెలుస్తోంది.

Advertisement

Next Story