రూ.500, 200 నోట్లు రద్దు కాబోతున్నాయా..? కొత్త చర్చకు తెరలేపిన చంద్రబాబు లేటేస్ట్ కామెంట్స్

by Satheesh |   ( Updated:2024-07-09 12:08:30.0  )
రూ.500, 200 నోట్లు రద్దు కాబోతున్నాయా..? కొత్త చర్చకు తెరలేపిన చంద్రబాబు లేటేస్ట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రూ.500, 200 నోట్ల రద్దుపై టీడీపీ చీఫ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో కొట్టేసిన సొమ్ముతో కొందరు వ్యవస్థను మేనేజ్ చేయాలని చూస్తున్నారని.. ఈ అవినీతి ప్రయత్నాలను అడ్డుకోవాలంటే రూ.500, రూ.200 నోట్లు రద్దు చేయాలని చంద్రబాబు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రూ.500, రూ.200 నోట్లు రద్దు చేసి వీటి స్థానంలో డిజిటల్ కరెన్సీని ప్రోత్సాహించాలని ఈ సందర్భంగా బాబు బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. ఇక, తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను చంద్రబాబు ఈ సమావేశంలో బ్యాంకర్లకు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల నిధుల మంజూరుకు సహకరించాలని కోరారు.

రైతు రుణాల మాఫీ, రైతులకు పెట్టుబడి సాయం అందించే విషయంలో బ్యాంకర్లు కో అపరేట్ చేయాలని అన్నారు. ఈ సమావేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.5,40,000 కోట్లతో రుణ ప్రణాళికను అధికారులు రిలీజ్ చేశారు. కాగా, నల్లధన నిర్మూలనలో భాగంగా 2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. మోడీ నేతృత్వంలోని అప్పటి ఎన్డీఏ సర్కార్ రూ.1000, 500 నోట్లను రద్దు చేసింది. వీటి స్థానంలో కొత్తగా రూ.2000, 500, 200 నోట్లను తీసుకొచ్చింది. ఈ క్రమంలో కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న చంద్రబాబు మరోసారి నోట్ల రద్దు గురించి మాట్లాడటం ఏపీతో పాటు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరోసారి మోడీ ప్రభుత్వం నోట్లు రద్దు చేయబోతుందా..? అందులో భాగంగానే చంద్రబాబు మరోసారి నోట్ల రద్దు ప్రస్తావన తీసుకువచ్చారా..? అన్న చర్చ జోరుగా జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed