- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ కేబినెట్ భేటీలో చంద్రబాబు సీరియస్.. పేరు చెడగొడుతున్నారంటూ తీవ్ర ఆగ్రహం
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ జరిగింది ఈ భేటీలో అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ పార్టీకి ఉన్న మంచి పేరును చెడగొడుతున్నారంటూ నిప్పులు చెరిగారు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేల వల్ల పతిష్ట దెబ్బతింటోందని ధ్వజమెత్తారు. అటు మంత్రులు సైతం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జిల్లాల్లో ఎమ్మెల్యేలు, నాయకులు, ప్రజలకు మంత్రులు అందుబాటులో ఉండాలని, పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చేలా ఎవరు ప్రవర్తించినా ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. పార్టీ నేతలు, కార్యకర్తలకు మంచి చెడులు సూచించాల్సిన బాధ్యతలను మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా ఎమ్మెల్యేలు చూసుకోవాలన్నారు. ఆ బాధ్యతను సైతం మంత్రులే తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.