CM Chandrababu: వన్ నేషన్.. వన్ ఎలక్షన్ పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Rani Yarlagadda |
CM Chandrababu: వన్ నేషన్.. వన్ ఎలక్షన్ పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: వన్ నేషన్, వన్ ఎలక్షన్ (one nation - one election) పై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో కనకదుర్గమ్మ దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశంలో ఒకేసారి ఎన్నికలు (jamili elections) నిర్వహించడం అందరికీ మంచిదని పేర్కొన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సంవత్సరం ఎన్నికలు నిర్వహించడం వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే.. అభివృద్ధిపై దృష్టిపెట్టేందుకు సమయం ఉంటుందని అభిప్రాయపడ్డారు. గడిచిన ఐదేళ్లలో ఎంతటి విధ్వంసకరపాలన చూశారో యువత గుర్తుంచుకోవాలని సూచించారు. సుపరిపాలనతో ఎలాంటి ప్రయోజనాలుంటాయో మోదీ హయాంలో ప్రజలు చూశారు కాబట్టే.. హర్యానా (Haryana Hattrick)లో మూడోసారి కూడా బీజేపీకే పట్టం కట్టారన్నారు.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం.. దేశఅభివృద్ధికి శుభసూచకమని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు. సుస్థిరత, అభివృద్ధికే ఓటేశారని తెలిపారు. అలాగే జమ్ముకశ్మీర్లో (jammu&kashmir) ఓటమి పాలైనప్పటికీ.. బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. రానున్న రోజుల్లో మహారాష్ట్ర, జార్ఖండ్ (maharashtra, jharkhand elections) రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి మంచి ఫలితాలొస్తాయని ఆశిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed