- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
CM Chandrababu: ఆ శంకరుడు సకల శుభాలను అనుగ్రహించాలి.. సీఎం చంద్రబాబు ట్వీట్

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి (Maha Shivratri) పర్వదిన వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ శివాలయాలను భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహా శివరాత్రి (Maha Shivratri) పర్వదినం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘పవిత్రమైన మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. నదీ స్నానాలు, ఉపవాసం, జాగరణ దీక్షలను అత్యంత నిష్ఠతో ఆచరిస్తున్న భక్తులకు ఆ శంకరుడు సకల శుభాలను, ఆనంద ఆరోగ్యాలను అనుగ్రహించాలని కోరుకుంటున్నా’ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ట్వీట్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు తెల్లవారుజాము నుంచే భక్తుతో కళకళలాడుతున్నాయి. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని శ్రీశైల క్షేత్రంతో పాటు యాగంటి, శ్రీకాళహస్తి, పల్నాడు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో మహాశివ రాత్రి వేడుకలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఇక తెలంగాణ (Telangana)లోని మేడ్చల్ జిల్లా కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయం, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, రంగారెడ్డి జిల్లాలోని శివగంగ రాజరాజేశ్వర స్వామి ఆలయం, మహబూబ్‌నగర్ జిల్లాలోని ఉమామహేశ్వర ఆలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి.