Amaravati : సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. అమరావతిపై శ్వేతపత్రం విడుదలకు సిద్ధం

by Jakkula Mamatha |   ( Updated:2024-06-20 09:40:46.0  )
Amaravati : సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. అమరావతిపై శ్వేతపత్రం విడుదలకు సిద్ధం
X

దిశ,వెబ్‌డెస్క్: రాజధాని అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. సీఎం హోదాలో చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. తన రెండో క్షేత్ర స్థాయి పర్యటనను రాజధానిలో చేపట్టారు. ఉండవల్లిలో వైసీపీ ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచి రాజధాని పర్యటనను నేడు(గురువారం) ప్రారంభించారు. ప్రజావేదిక శిథిలాలను పరిశీలించారు. ఆ తర్వాత రాజధాని నిర్మాణాలను సీఎం పరిశీలించారు. ఈ నేపథ్యంలో అమరావతి పై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. వైసీపీ హయాంలో అమరావతిలో ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉండిపోయిందని మండిపడ్డారు. 80 శాతం పూర్తయిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా పూర్తి చేయలేదన్నారు. భవనాలు బూజు పట్టి పోయాయి. రైతుల్ని ఎంతో ఇబ్బంది పెట్టి దౌర్జన్యంగా వ్యవహరించారు. అన్ని ప్రాంతాల నుంచి పవిత్ర మట్టి, నీరు తెచ్చి అమరావతి శంకుస్థాపన చేశాం. ఈ స్థల మహత్యమే అమరావతిని కాపాడింది అని అన్నారు. వైసీపీ హయాంలో రాజధాని రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story