CM Chandrababu:చిన్న పరిశ్రమల నిర్వాహకులకు సీఎం చంద్రబాబు భారీ గుడ్ న్యూస్

by Jakkula Mamatha |   ( Updated:2024-09-13 12:34:33.0  )
CM Chandrababu:చిన్న పరిశ్రమల నిర్వాహకులకు సీఎం చంద్రబాబు భారీ గుడ్ న్యూస్
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చిన్న పరిశ్రమల నిర్వహకులకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం MSME, ఫుడ్ ప్రాసెసింగ్(Food processing) రంగాల అభివృద్ధి పై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) క్రెడిట్ గ్యారంటీ ఫండ్(Credit Guarantee Fund) కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధుల్లో వంద కోట్ల రూపాయలను చిన్న పరిశ్రమలకు(Small industries) కేటాయిస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ నిధికి రూ.900 కోట్లు వస్తాయని చెప్పారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(MSME)కు కొల్లేటరల్ సెక్యూరిటీ లేకుండా రుణాలు ఇవ్వడానికి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమలకు చేయూత అందించడానికి ఈ నిధి ఉపయోగపడుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు.

ఈ క్రమంలో చిన్న పరిశ్రమల(Small industries) ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉండేలా TCS రూపొందిస్తున్న MSME వన్ యాప్‌ను రెండు నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. చిన్న పరిశ్రమల కోసం ప్రతి జిల్లాలో కనీసం రెండు MSME పార్కుల చొప్పున 50 పార్కులను రంగాల వారీగా అభివృద్ధి చేస్తామని, చిన్న పరిశ్రమల డేటా బ్యాంక్ కోసం కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రైజింగ్ అండ్ యాక్సెలరేటింగ్ MSME పెర్ఫార్మెన్స్ (రాంప్) కార్యక్రమాన్ని అక్టోబర్ 2న ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed