- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Srisailam Project:కృష్ణా నదికి జల హారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు
దిశ,వెబ్‌డెస్క్:ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నేడు(గురువారం) శ్రీశైలం పర్యటనలో భాగంగా ప్రాజెక్టును సందర్శించారు. ఈ క్రమంలో శ్రీశైలంలో కొలువుదీరిన భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకున్నారు. మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మకు జలహారతి పట్టారు. అలాగే కృష్ణా నదికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ముఖ్యమంత్రికి అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం సీఎం చంద్రబాబుకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కృష్ణా నదికి జలహారతి ఇచ్చిన అనంతరం చంద్రబాబు సాగునీటి వినియోగదారులతో సమావేశం అయ్యారు. ప్రాణకోటి జీవనాధారమైన జలాలను ఇచ్చే నదులను దేవతలుగా భావించి పూజించే సంస్కృతి మనది. నిండుకుండలా ఉన్న శ్రీశైలం జలాశయం వద్ద కృష్ణమ్మకు జలహారతిని ఇవ్వడం ఎంతో సంతోషాన్ని, సంతృప్తి ఇచ్చింది. సమృద్ధిగా కురుస్తున్న వర్షాలు రైతుల కళ్లలో ఆనందం నింపుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు.