మంగళగిరిలో వనమహోత్సవం..హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం

by Jakkula Mamatha |   ( Updated:2024-08-30 11:10:52.0  )
మంగళగిరిలో వనమహోత్సవం..హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం
X

దిశ, డైనమిక్​ బ్యూరో:మంగళగిరి ఎయిమ్స్​ సమీపంలోని ఎకో పార్క్‌లో వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత నరసరావుపేటలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించినా వర్షం కారణంగా వాయిదా పడింది. దీంతో ఎకో పార్క్‌కు వనమహోత్సవానకి పర్యటనను మార్పు చేశారు. ముందుగా ఉప ముఖ్యమంత్రి పవన్​ కళ్యాణ్​ ఎకో పార్క్ కి చేరుకున్నారు. ఆయనకు అధికారులు, స్వాగతం పలికారు. పార్క్‌లో కలియ తిరుగుతూ మొక్కలు, చెట్ల గురించి ఆయన ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. హరితాంధ్ర కోసం అడుగులు వేద్దామని, మొక్కలు నాటుదాం అని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్​తో కరచాలనం చేసేందుకు మహిళలు ఆసక్తి చూపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి మొక్కలకు నీరు పోశారు.

Advertisement

Next Story

Most Viewed