Breaking: పలు విమానాలు రద్దు

by srinivas |   ( Updated:2024-11-30 11:46:26.0  )
Breaking: పలు విమానాలు రద్దు
X

దిశ, వెబ్ డెస్క్: ఫెంగల్ తుఫాన్(Fengal Typhoon) ఎఫెక్ట్‌తో తమిళనాడు(TamilNadu)లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో చెన్నై(Chennai) నగరం చిత్తడిగా మారింది. రైల్వే, బస్ స్టేషన్లలో వర్షపు నీరు చేరింది. ఎయిర్‌పోర్ట్‌ ప్రాంతం కూడా తడిగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు తెలుగురాష్ట్రాల్లోనూ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో పలు చోట్ల ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విమానయాన శాఖ(Aviation Department) కీలక నిర్ణయం తీసుకుంది. వాతావరణం సరికా లేకపోవడంతో అప్రమత్తమైంది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు(Tamilnadu) మధ్య నడిచే పలు విమాన సర్వీసులను రద్దు చేసింది. చెన్నై-విశాఖ-చెన్నై, తిరుపతి-విశాఖ-తిరుపతి విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్-తిరుపతికి వెళ్లాల్సిన 7 విమానాలు, చెన్నై-హైదరాబాద్ వెళ్లాల్సిన 3 విమనాలను రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ సమాచారం మేరకు ప్రయాణికులు ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించింది. వర్షాలు తగ్గిన తర్వాత విమానాలను యాథావిథిగా నడపనున్నట్లు వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed