- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP Politics: ఆ పార్టీ ప్రముఖ నేతకు సిఐ బెదిరింపులు.. చర్యలు తీసుకోవాలని డిమాండ్
దిశ వినుకొండ: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి సీఐ చిన్న మల్లయ్యపపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలి టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే .. టీడీపీ నేతల సమాచారం ప్రకారం.. సోమవారం కారంపొడి కొత్త బస్టాండ్ వద్ద టీ స్టాల్ లో టిడిపి నాయకులు టీ తాగుతున్న సమయంలో సీఐ చిన్న మల్లయ్య టీ స్టాల్ దగ్గర జీపులో రౌండ్లు వేశారు.
అనంతరం నేరుగా టీ స్టాల్ వద్దకు వెళ్లి ఎవడ్రా వీరిని ఇక్కడ కూర్చోబెట్టింది అని బెదిరించి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారు. అలానే టీడీపీ నేతలపై దౌర్జన్యం చేస్తూ ఇక్కడినుంచి వెళ్లిపోండి అంటూ నోటికొచ్చినట్టు దుర్భాషలాడారు. ఈ నేపథ్యంలో సిఐ తీరును ప్రశించిన మండల పార్టీ అధ్యక్షుడు చప్పిడి రాముపై విరుచుకుపడ్డారు.
నన్ను ప్రశ్నిస్తారా అంటూ సీఐ చిన్న మల్లయ్య పోలీస్ అధికార జులుం ప్రదర్శించారు. అక్కడ ఉన్న టిడిపి శ్రేణుల్లో ఒకరైన దివ్యాంగుడును లాటితో కొట్టారు. అలానే మండల పార్టీ అధ్యక్షులు చప్పిడి రాముని పదరా స్టేషన్ కు అంటూ పబ్లిక్ లో లాటితో నెట్టారు. దీనితో ఇదేమిటని ప్రశ్నించిన టిడిపి శ్రేణులపై తుపాకీ గురిపెట్టి కాల్చి వేస్తానంటూ గూండాలా ప్రవర్తించారు.
కాగా సీఐ చిన్న మల్లయ్య తీరుపై టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేసారు. టిడిపి నాయకులను కాల్చమని సీఐ చిన్న మల్లయ్య కి ఎవరు ఆదేశించారో బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు. రేయ్.. కాలిచ్చిచేస్తా ఏమనుకుంటున్నావో.. రౌడీ షీట్ కరిచి లాకప్ లో వేస్తా.. అంటూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించిన సిఐ చిన్న మల్లయ్య ను వెంటనే సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.