Gudur: పసికందును వదలేసి వెళ్లిన మహిళ

by srinivas |
Gudur: పసికందును వదలేసి వెళ్లిన మహిళ
X

దిశ, గూడూరు: తిరుపతి జిల్లా గూడూరు చర్చి రోడ్డు సమీపంలో భిక్షాటన చేసి జీవించే దంపతుల వద్ద రెండు రోజుల పసికందును ఓ గుర్తుతెలియని మహిళ వదిలివెళ్లారు. కాలకృత్యాలకు అని చెప్పి వెళ్లిన మహిళ ఎంతసేపటికి రాకపోవడంతో వృద్ధ దంపతులు సమీపంలోని ఆర్డీవో అధికారులకు సమాచారం అందించారు. ఆర్డీవో కిరణ్ కుమార్ ఆదేశాల మేరకు ఐసీడీఎస్ అధికారులు బిడ్డ సంరక్షణ చూసుకుంటున్నారు. బిడ్డ సంరక్షణకు సంబంధించి ఐసీడీఎస్ CDPO మహబూబ్ బీ, సూపర్వైజర్ ఆషాబేగం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు..

Advertisement

Next Story