- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీ అధికారంలోకి రాగానే..టి.డి.ఆర్ బాండ్లపై విచారణ జరిపిస్తాం..
దిశ ప్రతినిధి, తిరుపతి: తిరుపతిలో సుమారు 4000 కోట్ల పైగా టి.డి.ఆర్ బాండ్ల స్కాం జరిగిందని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే టి డి ఆర్ బాండ్ల పై విచారణ జరిపిస్తామని.. ఇందులో ప్రధాన కారకులైన భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ రెడ్డిని జైలుకు పంపడం తధ్యమని.. తిరుపతి తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు ఎం.సుగుణమ్మ స్పష్టం చేశారు. గురువారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాళ్లు పట్టుకొని తన కొడుక్కి తిరుపతి ఎమ్మెల్యే సీటు తెప్పించుకున్నారు. దానికి కావలసిన పెట్టుబడిని తిరుపతి లో మాస్టర్ ప్లాన్ రోడ్లతో దోచుకుంటున్నారని విమర్శించారు.
స్థానికంగా వైసిపి నాయకులు చేస్తున్న అరాచక కార్యక్రమాలు ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిఘటిస్తూ ఉందని ఆమె తెలిపారు. అధికారుల అండదండలతో వైసీపీ నాయకులు యదేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఒకసారి ఆలోచించండి ..మీకు మరో ఛాన్స్ ఇస్తున్నాం ఇకనైనా మేల్కొనండి ..ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడండి అని కోరారు. రాష్ట్రంలో యువతను గంజాయి మత్తులో ముంచేసిందని వైఎస్సార్సీపీ పార్టీ పైన తీవ్రంగా ధ్వజమెత్తారు.
తిరుపతిలో ఎమ్మార్వోలు , కలెక్టర్లు , టి.డి.ఆర్ బాండ్లపై చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు. కపిల తీర్థం వద్ద నిర్మించిన మున్సిపల్ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ లీజు లో కూడా అవినీతి జరిగిందని ఆమె ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీ ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని ఆమె తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు దంపూరి భాస్కర్ యాదవ్, రమణ, పుష్పలత, శాంతమ్మ , అనిత, లక్ష్మీ పాల్గొన్నారు.
Read More..
మాజీ మంత్రి గంటా వ్యాఖ్యలతో కిమిడి నాగార్జున మనస్థాపం