- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుపతిలో వందేభారత్ రైలు రిజర్వేషన్ ప్రారంభం
దిశ, తిరుపతి: సికింద్రాబాద్‌లో వందే భారత్ ట్రైన్‌ను శనివారం ప్రధాని మోడీ ప్రారభించబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రైల్వే అధికారులు శుక్రవారం తిరుపతిలో రిజర్వేషన్ కౌంటర్‌ను ప్రారంభించారు. ఇందుకు సంబంధించి..మొదటి రోజు ఈ రైల్ 13 స్టేషన్లలో ఆగుతుందని తిరుపతి రైల్వే అధికారులు చెప్పారు. ఫస్ట్ డే ప్రత్యేక సమయాల్లో ఈ రైలును నడపనున్నారు. ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు ఈ రైలుకు ప్రతీ స్టేషన్‌లో స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 9 నుండి తిరుపతి నుంచి మధ్నాహ్నం 3.15 గంటలకు బయల్దేరి సికింద్రాబాద్ చేరుతుంది. 10వ తేదీ నుంచి ఉదయం సికింద్రాబాద్‌లో బయల్దేరి తిరుపతి చేరుకుంటుంది. తిరిగి తిరుపతి నుంచి బయల్దేరి రాత్రికి సికింద్రాబాద్ చేరుకొనేలా షెడ్యూల్ ఖరారు చేశారు.
మొత్తం 16 కోచ్‌లతో ఈ రైలు సిద్ధం అయింది. 8.30 గంటల్లోనే సికింద్రాబాద్ నుంచి వందేభారత్ తిరుపతి చేరుకోనుంది. ఇదిలా ఉంటే తిరుపతి - సికింద్రాబాద్ వందేభారత్ రిజర్వేషన్‌ను శుక్రవారం ప్రారంభించారు. ట్రైన్ నెంబర్ 20701 ద్వారా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, అదే విధంగా 20702 నెంబర్ ద్వారా తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు రిజర్వేషన్ అందుబాటులోకి వచ్చింది. ఈ రైలులో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చైర్ కార్ టికెట్ ధర రూ 1,680 గా నిర్ధారించారు. అందులో కేటరింగ్ ఫీజు రూ 364గా ఉంది. వద్దనకుంటే ఆ ఛార్జీ మినహాయిస్తారు. అదే విధంగా ఈ రూటులో ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ 3,080గా నిర్ణయించారు. అదే విధంగా తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ఛైర్ కార్ ధర రూ 1,625గా ఉంది. అదే రూటులో ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ. 3,030గా ఖరారు చేశారు.
వారంలో మంగళవారం మినహా ప్రతీ రోజు ఈ రైలు రాకపోకలు ఉంటాయి. వందేభారత్ ప్రతీ రోజు ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి నల్గొండ కు 07.19కి, గుంటూరుకు 9.45, ఒంగోలుకు 11.09, నెల్లూరుకు 12.29 చేరుకొని..అక్కడ నుంచి మధ్నాహ్నం తిరుపతికి 14.30 చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో భాగంగా.. తిరుపతిలో మధ్నాహ్నం 15.15కి బయల్దేరి..నెల్లూరుకు సాయంత్రం 17.20, ఒంగోలు 18.30, గుంటూరు 19.45, నల్గొండకు 22.10, సికింద్రాబాద్‌కు రాత్రి 23.45కి చేరుకుంటుంది. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య కేవలం నాలుగు స్టేషన్‌లలో మాత్రమే ఈ ట్రైన్ ఆగనుంది
ఇవి కూడా చదవండి: వారణాసిలో ఎంపీ జీవీఎల్ సందడి.. గంగా పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష