- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కారులో ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా.. ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్

దిశ ప్రతినిధి, తిరుపతి: తిరుపతి జిల్లా పుత్తూరు అటవీ ప్రాంతంలో అక్రమ రవాణా చేస్తున్న 112 ఎర్రచందనం దుంగలతో పాటు, రవాణాకు ఉపయోగించిన కారును తిరుపతి ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ ప్రత్యేక అధికారి ఎల్.సుబ్బారాయుడు ఆదేశాలతో ఆర్ఐ సాయి గిరిధర్‌కు చెందిన ఆర్ఎస్ఐ కేఎస్ కే లింగాధర్ టీమ్ వడమాలపేట, పుత్తూరు మీదుగా నారాయణవనం వరకు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లను తనిఖీ చేసుకుంటూ వెళ్లారు.
బుధవారం తిరుమల కుప్పం మెయిన్ రోడ్డులోని రామసముద్రం గ్రామం వద్ద వాహనాలను తనిఖీ చేపట్టారు. వాహనాల తనిఖీలను గమనించిన ఇద్దరు వ్యక్తులు వారి వాహనం దిగి పారిపోవడానికి ప్రయత్నించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు వెంటనే స్పందించి, వారిని వెంబడించి పట్టుకున్నారు. వాహనం తనిఖీ చేయగా అందులో 112 ఎర్రచందనం దుంగలు లభించాయి. వీటి విలువ సుమారు రూ.45 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. దుంగలతో పాటు స్మగ్లర్లను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు స్టేషన్‌కు తరలించగా, ఎస్ఐ రఫీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also..