శ్రీవారి భక్తులకు రెండు శుభవార్తలు.. లడ్డూతో పాటు మరో ప్రసాదం

by srinivas |   ( Updated:2023-04-01 12:03:02.0  )
శ్రీవారి భక్తులకు రెండు శుభవార్తలు.. లడ్డూతో పాటు మరో ప్రసాదం
X

దిశ, తిరుపతి: శ్రీవారి భక్తులకు లడ్డు ప్రసాదంతో పాటు మరో ప్రసాదం అందించాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమల ఆలయాల్లో సేవలకు ఉపయోగించిన పువ్వులను పరమ పవిత్రంగా భావిస్తారు. ఆ పువ్వులతో పరిమళభరితమైన అగరబత్తులను తయారు చేసి భక్తులకు అందించేందుకు టీటీడీ ముందుకు వచ్చింది. అలాగే దేశవాళీ గోజాతులను అభివృద్ధి చేయడం కోసం దాతల సహకారంతో 500 దేశవాళీ గోవులను సమీకరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రాజస్థాన్ నుంచి ఇప్పటి వరకు 120కి పైగా గిర్, కాంక్రీజ్ దేశవాళీ జాతుల గోవులను తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ తయారు చేసే సమగ్ర దాణాను గోవులకు అందించడం వల్ల పాల ఉత్పత్తి పెరగడంతో పాటు గోవులు ఇచ్చే పాలలో ప్రొటీన్‌ శాతం మరింత అధికంగా లభిస్తుందని టీటీడీ భావిస్తోంది. అటు అగరబత్తులకు కూడా భక్తుల నుంచి భారీగా డిమాండ్ ఉంటుందని ఆశిస్తోంది.


తిరుమల నడకమార్గాల్లో దివ్యదర్శనం టోకెన్లు జారీ పునః ప్రారంభం

దిశ, తిరుపతి: తిరుమల నడకమార్గాల్లో దివ్యదర్శనం టోకెన్ల జారీని టీటీడీ పునః ప్రారంభించింది. కోవిడ్ నేపథ్యంలో మూడేళ్లుగా టీటీడీ దివ్యదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసింది. అయితే భక్తుల కోరిక మేరకు అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం వద్ద 10 వేలు, శ్రీవారిమెట్టు మార్గం 1250వ మెట్టు దగ్గర 5 వేల దివ్యదర్శనం టోకెన్లను అందిస్తోంది. భక్తులు నేరుగా తమ ఆధార్ కార్డుతో హాజరై టోకెన్లు తీసుకోవచ్చు. కొద్దిరోజులపాటు ప్రయోగాత్మకంగా దివ్యదర్శనం టోకెన్ల జారీని టీటీడీ పరిశీలించనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టోకెన్లు పొందాలని టీటీడీ కోరింది.

Advertisement

Next Story

Most Viewed