- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Tirumala:శ్రీనివాస కళ్యాణోత్సవానికి సీఎం చంద్రబాబును ఆహ్వానించిన టీటీడీ చైర్మన్

దిశ ప్రతినిధి, తిరుపతి: టీటీడీ ఆధ్వర్యంలో సీఆర్డీఏ పరిధిలోని వేంకటపాలెంలో శనివారం సాయంత్రం జరగనున్న శ్రీనివాస కళ్యాణోత్సవానికి హాజరు కావాలని సీఎం చంద్రబాబుకు టీటీడీ ఛైర్మన్ బీఆర్.నాయుడు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆహ్వానించిన వారిలో టీటీడీ బోర్డు సభ్యులు, టీటీడీ ఈవో జె. శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకన్న చౌదరి కూడా ఉన్నారు. ఏపీ రాష్ట్ర హెఆర్డీ , ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యులు ఆహ్వానించారు.
అంతకుముందు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎం ఎస్ రాజు, నన్నపనేని సదాశివరావు, ముని కోటేశ్వరరావు, ఆర్ ఎన్ దర్శన్, ఎం.శాంతారామ్, తమ్మిసెట్టి జానకి దేవి, సుచిత్ర ఎల్లా, ఎస్ నరేష్ కుమార్ పాల్గొన్నారు.