- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mp Gurumurthy: తిరుపతి జిల్లా నుంచి వెళ్లిన వారంతా క్షేమం
దిశ, తిరుపతి: హౌరా ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతి జిల్లా నుంచి వెళ్లిన వాళ్లంతా క్షేమంగా ఉన్నారని తిరుపతి లోక్‌సభ సభ్యుడు గురుమూర్తి వెల్లడించారు. ఒడిశాలో రైలు ప్రమాదం నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన తిరుపతికి రైల్వే స్టేషన్‌కి వెళ్లారు. అధికారుల నుంచి బాధితులు ఎవరైనా ఉన్నారా అనే వివరాలు తెలుసుకున్నారు. మృతులు, గాయపడ్డ వారు ఉన్నారా అని ఆరా తీశారు. రైల్వే రిజర్వేషన్ వివరాలు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుపతి నుంచి 18 మంది, రేణిగుంట నుంచి 8 మంది, గూడూరు నుంచి ఇద్దరు ప్రయాణికులు హౌరా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారని తెలిపారు. వారంతా సురక్షితంగా ఉన్నారని, అవసరమైన సహాయ సహకారాలు తిరుపతి రైల్వే అధికారులు అందిస్తున్నారని పేర్కొన్నారు. తిరుపతి రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు ఎంపీ గురుమూర్తి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Odisha Rail Incident: ఏపీ వాసులు మృతి చెందినట్లు సమాచారం లేదు: బొత్స