- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అఖండ పారాయణంతో పులకించిన తిరుమలగిరులు
దిశ, తిరుమల: అయోధ్యకాండ అఖండ పారాయణంతో తిరుమల గిరులు పులకించిపోయాయి. లోక కల్యాణార్థం శ్రీవారిని వేద పండితులు ప్రార్థించారు. తిరుమల నాదనీరాజనం వేదికపై ఏడవ విడత అయోధ్యా కాండ అఖండ పారాయణంతో తిరుమలగిరులు ఆధ్యాత్మిక శోభతో మార్మోగాయి. ఇందులో 22 నుండి 25వ సర్గల వరకు గల 155 శ్లోకాలను పారాయణం చేశారు. యోగవాసిష్టం ధన్వంతరి మహామంత్రం 25 శ్లోకాలు పారాయణం చేశారు. వేద పండితులు అఖండ పారాయణం చేయగా పలువురు భక్తులు భక్తిభావంతో వారిని అనుసరించి శ్లోక పారాయణం చేశారు. ధర్మగిరి వేద విజ్ఞానపీఠంకు చెందిన ప్రముఖ పండితులు శేషాచార్యులు,అనంత, మారుతి శ్లోక పారాయణం చేశారు. అఖండ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యాయన సంస్థకు చెందిన వేద పారాయణ దారులు, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి చెందిన పండితులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన నాగరాజు బృందం రామనామ సంకీర్తనను, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులైన రఘునాథ్ బృందం ఆలపించిన " పాహిరామ ప్రభో, పాహిరామ ప్రభో " సంకీర్తనలు శ్రోతలను అలరింప చేశాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, పండితులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.