Tirupatiలో ముగ్గురు అంతరాష్ట్ర దొంగల అరెస్ట్

by srinivas |
Tirupatiలో ముగ్గురు అంతరాష్ట్ర దొంగల అరెస్ట్
X

దిశ, తిరుపతి: ముగ్గురు అంతరాష్ట్ర ఎర్రచందనం దొంగలను పోలీసులు పట్టుకున్నారు. యర్రావారిపాలెం మండలం యల్లమంద క్రాస్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులను వీరు గాయపరిచి పరిపోయేందుకు ప్రయత్నం చేశారు. దీంతో మిగిలిన పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ. 21 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలతో పాటు కారు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేసినట్లు గుర్తించారు. ఎర్రచందనాన్ని బెంగుళూరులోని ఓ బడా స్మగ్లర్‌కు చేరవేస్తారని పోలీసులు తెలిపారు. త్వరలో ఆ నిందితుడిని కూడా పట్టుకుంటామని తెలిపారు. నిందితులు తమిళనాడు వాసులని చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed