- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > ఆంధ్రప్రదేశ్ > చిత్తూరు > మంత్రి రోజాపై అసభ్యకర వ్యాఖ్యలు.. నగరి కోర్టుకు హాజరైన టీడీపీ మాజీ మంత్రి
మంత్రి రోజాపై అసభ్యకర వ్యాఖ్యలు.. నగరి కోర్టుకు హాజరైన టీడీపీ మాజీ మంత్రి
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: మంత్రి రోజాపై టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అసభ్యకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న మంత్రి రోజా.. బండారు సత్యనారాయణపై తిరుపతి జిల్లా నగరిలో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ నగరి కోర్టుకు హాజరయ్యారు. ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతోంది. ఇరువర్గాల మధ్య వాదనలు కొనసాగుతున్నాయి.
ఈ కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు ఆయన అంతకుముందు విశాఖ నుంచి నగరికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అక్రమ కేసులకు భయపడమని చెప్పారు. నెల రోజుల్లో జగన్ పాలనకు తెరపడబోతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు అధికారం ఖాయమని బండారు సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు.
Next Story