TTDకి రూ.25 లక్షల విలువైన అంబులెన్స్ విరాళం

by srinivas |   ( Updated:2023-01-07 14:43:58.0  )
TTDకి రూ.25 లక్షల విలువైన అంబులెన్స్ విరాళం
X

దిశ, తిరుపతి: రూ.25 లక్షలు విలువైన అంబులెన్స్‌ను తిరుమల తిరుపతి దేవస్థానానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విరాళంగా అందజేసింది. ముందుగా శ్రీవారి ఆలయం ఎదుట అంబులెన్స్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బ్యాంకు ఛైర్మన్ దినేష్ కుమార్ ఖార అంబులెన్స్ తాళాలను టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు. స్విమ్స్ ఆసుపత్రిలో ఈ అంబులెన్స్‌ను వినియోగించనున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, డీఐ జానకిరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story