Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆర్జిత సేవా టికెట్ల రిలీజ్

by srinivas |   ( Updated:2023-06-19 13:02:47.0  )
Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆర్జిత సేవా టికెట్ల రిలీజ్
X

దిశ, తిరుపతి: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతిలో కొలువైన వెంకటేశ్వర స్వామిని తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని హిందువులు భావిస్తారు. అయితే మారుతున్న కాలంతో పాటు స్వామివారిని దర్శించుకోవడం కూడా సులభం అయింది. ఇక కరోనా తర్వాత స్వామివారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్ధం టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆన్ లైన్‌లో శ్రీవారి దర్శనం కోసం భక్తులకు స్పెషల్ దర్శన టికెట్లతో సహా అన్ని రకాల ఆర్జిత సేవా టికెట్లను రిలీజ్ చేస్తూ స్వామివారి దర్శనాన్నీ మరింత సులభతరం చేస్తోంది టీటీడీ. ఈ నేపథ్యంలో సోమవారం టీటీడీ అధికారులు సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటాను ఆన్ లైన్‌లో విడుదల చేసింది.

స్వామివారి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలకు భక్తులు ఆన్ లైన‌లో నమోదు చేసుకోవల్సి ఉంటుంది. స్వామి వారి ఆర్జిత సేవల్లో పాల్గొనాలనుకునే భక్తులు 21 తేది ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చనని పేర్కొంది. నమోదు చేసుకున్న భక్తులను లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేస్తారు. అంతేకాదు స్వామివారి ఆర్జిత సేవలకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన కోటా వివరాలను కూడా టీటీడీ సిబ్బంది వెల్లడించింది. ఈ నెల 22న స్వామివారి కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించిన టికెట్లను వర్చువల్ కోటాలో జూన్ 22 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్‌లో విడుదల చేయనున్నారు. అంతేకాదు ఇదే రోజున శ్రీవారి పవిత్ర ఉత్సవాలకు సంబంధించిన సేవా టికెట్లను కూడా రిలీజ్ చేయనుంది.

Advertisement

Next Story

Most Viewed