- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Srikalahasti: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి.. భర్తపైనే అనుమానాలు
దిశ, శ్రీకాళహస్తి: అనుమానస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటన గురువారం కేవీబీపురం మండలం రాయపేడు ఎస్సీ కాలనీలో చోటుచేసుకుంది. రాయపేడు ఎస్సీ కాలనీకి చెందిన ఆనంద్ (27). సంధ్య (31) మూడేళ్ల క్రిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. సజావుగా సాగిన వీరి కాపురంలో అనుమానం తలెత్తడంతో ఏడాదిగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. ఇందులో భాగంగానే గురువారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్త ఆనంద్ భార్య సంధ్యతో గొడవకు దిగాడు. గురువారం రాత్రి 10 గంటల వరకు ఇద్దరు మధ్య కేకలు వినిపించాయి. అనంతరం కేకలు ఇరుగుపొరుగు వారికి వినిపించకపోవడంతో భార్యాభర్తలు సర్దుకున్నారని మౌనంగా ఉన్నారు. గురువారం ఉదయం ఆనంద్ తన భార్య ఆత్మహత్య చేసుకుందని చెప్పడంతో ఇరుగుపొరుగు వారు వెళ్లి చూసేసరికి సంధ్య విధాతజీవిగా పడి ఉంది. మృతురాలి భర్త ఆనంద్ చెప్పే మాటలు, సంఘటన స్థలంలో కనిపిస్తున్న ఆధారాలకు పొంతన లేకపోవడంతో స్థానికులు భర్త ఆనందకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మృతురాలు తండ్రి మురగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. శవ పంచనామ నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక పోస్టుమార్టం నివేదిక అనంతరం సంధ్య ఎలా చనిపోయిందో విచారించి అనంతరం కేసు దర్యాప్తు చేపడతామని ఎస్సై వివరించారు.