- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tirupati: లోకేష్ బహిరంగ సభకు పోలీస్ బ్రేక్
దిశ, తిరుపతి: ఏపీలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రతో తిరుపతికి చేరుకున్న లోకేష్.. ఇవాళ విద్యార్థులతో భేటీ కావాల్సి ఉంది. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు లోకేష్ సిద్ధమైన తరుణంలో స్ధానిక పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. తిరుపతిలో యువగళం పాదయాత్రకు లోకేష్ ఇప్పటికే పోలీసుల అనుమతి తీసుకున్నారు. అయితే నారా లోకేశ్‍కు అలిపిరి పోలీసులు ఇవాళ నోటీసులు ఇచ్చారు. అంకుర ఆస్పత్రి రోడ్డులోని వసతి కేంద్రం వద్ద లోకేష్‌కు పోలీసులు నోటీసులు అందించారు. లోకేష్ ఇవాళ విద్యార్థులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పాదయాత్రకు మాత్రమే అనుమతి ఉందన్నారు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
తిరుపతిలో నారా లోకేష్ పాదయాత్రలో నోటీసుల పర్వం కలకలం రేపింది. తిరుపతి నగర వీధుల్లోనూ పాదయాత్రకు అనుమతి లేదని లోకేష్‌కు పోలీసులు తేల్చిచెప్పేశారు. పది రోజుల క్రితమే టీడీపీ నేతలు అడ్మిన్ ఎస్పీని కలిసి రూట్ మ్యాప్ అందించారు. అయితే చివరి నిమిషంలో వైసీపీ నేతల ఒత్తిడితోనే పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తున్నట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా నగర వీధుల్లోనే పాదయాత్ర కొనసాగుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.