- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tirupati: ఇకపై సచివాలయాల్లోనే విద్యుత్ ఫిర్యాదులు
దిశ, తిరుపతి: ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ విద్యుత్తు సంబంధిత ఫిర్యాదులు తీసుకుంటారని ఆ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చెప్పారు. అంతకుముందు తిరుపతి కలెక్టర్ ఆఫీస్‌లో విద్యుత్ సంబంధిత పోర్టల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గత ఏడాది అత్యధికంగా ఒక రోజులో 232 మిలియన్ యూనిట్లు వినియోగిస్తే... ఈ ఏడాది 248 మిలియన్ యూనిట్లు అందించామన్నారు. ఎక్కడా విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేస్తున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఇది ఒక నిదర్శనమని హర్షం వ్యక్తం చేశారు. పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని, అధికారులు శ్రమిస్తున్నారని, మరింత బాధ్యతతో పని చేయాలని సూచించారు.
గ్రామ, వార్డు సచివాలయంలో ఫిర్యాదులు కోసం పోర్టల్ ప్రారంభించామని మంత్రి పేర్కొన్నారు. రైతులను, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ఇంతకముందు 45 సేవలు అందిస్తున్నామని, తాజాగా మరో 12 సేవలు పొందుపరిచామని స్పష్టం చేశారు. సచివాలయంలో ఫిర్యాదు ద్వారా స్థానికంగా ఉండే అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరిస్తారన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి విజ్ఞప్తి చేశారు.