Ap News: నారా లోకేశ్ పాదయాత్రకు బ్రేక్

by srinivas |   ( Updated:2023-03-11 16:11:08.0  )
Ap News: నారా లోకేశ్ పాదయాత్రకు బ్రేక్
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యకదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు రెండు రోజుల పాటు బ్రేక్ ఇచ్చారు. రాష్ట్రంలో ఈ నెల 13న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండటంతో కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఈ నెల 12, 13వ తేదీల్లో లోకేశ్ పాదయాత్రను నిలిపివేయనున్నారు. మళ్లీ ఈ నెల 14న తిరిగి పాదయాత్రను యథావిథిగా కొనసాగించనున్నారు. ప్రస్తుతం నారా లోకేశ్ అన్నమయ్య జిల్లా కంటేవారిపల్లిలో బస చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున పాదయాత్రను నిలిపివేయాలని శనివారం ఆయనకు నోటీలిచ్చారు. దీంతో నారా లోకేశ్ తన పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. మరో రెండు రోజుల తర్వాత అన్నమయ్య జిల్లా కంటేవారిపల్లి నుంచి యువగళం పాదయాత్రను కొగసాగించనున్నారు లోకేశ్.

Advertisement

Next Story