- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tirumala: నెల రోజుల్లో 19 సిఫార్సు లేఖలు.. టీచర్ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ గుట్టు రట్టు
దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు కోసం ఎందరో అక్రమార్కులు అడ్డదారులు తొక్కారు. అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. అదంతా దళారుల చేశారని అనుకుంటే ఈ వరుసలోకి ఓ బడా నేత వచ్చి చేరారు. దర్జాగా డబ్బుల కోసం శ్రీవారి దర్శన టికెట్లు అమ్ముకుంటున్నారు. దళారి అవతారమెత్తి విజిలెన్స్ అధికారులకు దొరికిపోయారు. ఆయనే టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ. గత నెలలో జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల నుంచి షేక్ షాబ్జీ గెలిచారు. గెలిచిన వెంటనే డబ్బులు సంపాదించాలనుకున్నారు. ఇందుకు శ్రీవారి సన్నిధిని ఎంచుకున్నారు.
శ్రీవారి దర్శనాలకు భక్తులు పోటెత్తుతుండటంతో వారి అవసరాన్ని క్యాష్ చేసుకోవాలనుకున్నారు. తరచూ శ్రీవారి దర్శనాలకు వెళ్లారు. దీంతో ఆయనపై విజిలెన్స్ అధికారులు దృష్టి పెట్టారు. ఆరా తీస్తే ఇతర రాష్ట్రాల భక్తులకు దర్శనం చేయించి డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు తేలింది. ఇలా నెల రోజుల వ్యవధిలోనే షేక్ షాబ్జీ మొత్తం 19 సిఫార్సు లేఖలు ఇచ్చినట్లు గుర్తించారు. నిన్న ఒక్క రోజే 14 మంది కోసం అడిషినల్ ఈవోకు లేఖ రాశారు. 10 మందికి మాత్రమే దర్శనానికి అనుమతి ఇచ్చారు.
ఇలా కర్ణాటక భక్తుల నుంచి రూ.1.05 లక్షలు వసూలు చేసినట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఆధార్ కార్డు టాంపరింగ్ చేసి షాబ్జీ డ్రైవర్ రాజు భక్తులను దర్శనాలకు పంపినట్లు నిర్ధారించారు. షాబ్జీ డ్రైవర్ రాజు నుంచి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు