- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Tirupati: గంగమ్మ తల్లికి సారె ఇవ్వడం అదృష్టం: మంత్రి రోజా
దిశ, తిరుపతి: గంగమ్మ తల్లికి సారె ఇచ్చే అదృష్టం కలగడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్. కె. రోజా పేర్కొన్నారు. తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర సందర్భంగా ఆదివారం ఉదయం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కుటుంబ సభ్యులతో కలసి గంగమ్మ తల్లికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ బిడ్డలందరినీ చల్లగా చూసుకుంటూ అందరిని కాపాడుకుంటూ పిల్లల భవిష్యత్తుకు తల్లులు కోరుకునే విధంగా ఇవ్వడమే గంగమ్మ తల్లికే చెల్లునని చెప్పారు. తాను చదువుకునే రోజుల్లో చూసిన గంగజాతరకు ఇప్పుడు జరుగుతున్న జాతరకు చాలా తేడా ఉందని చెప్పారు. తిరుపతి చిత్తూరు జిల్లాల ప్రజలకే కాకుండా భారత దేశ ప్రజలందరికీ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ మహిమ, గొప్పదనం, చరిత్రను, విశిష్టతను తెలియజేసే విధంగా గంగ జాతర నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈరోజు వేలాది మంది భక్తులు అమ్మను దర్శించుకోవడం, పొంగళ్లు పెట్టడం, మహా కుంభాభిషేకం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గంగమ్మ తల్లి అందరినీ చల్లగా చూడాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయు ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు అందజేయాలని, రాష్ట్ర పరిపాలనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని అమ్మవారిని కోరుకోవడం జరిగిందని తెలిపారు.