Prabhas Adipurush: జై శ్రీరాం నినాదాలతో మారుమోగిన తిరుపతి

by srinivas |   ( Updated:2023-06-06 12:57:26.0  )
Prabhas Adipurush: జై శ్రీరాం నినాదాలతో మారుమోగిన తిరుపతి
X

దిశ, తిరుపతి: జై శ్రీరామ్ .. జై శ్రీరామ్.. రాజారామ్ అంటూ తిరుపతి మారుమోగిపోతుంది. ప్రభాస్ ఫ్యాన్స్‌తో తిరుపతి మొత్తం కాషాయరంగు పులుముకుంది. ప్రభాస్, కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమా జూన్ 16న రిలీజ్ కానున్న విషయం తెల్సిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కొద్దిసేపట్లో ప్రారంభం కానున్న విషయం తెల్సిందే. ఇప్పటికే చిత్ర బృందం మొత్తం తిరుపతి చేరుకున్నారు. తిరుపతి చేరుకున్న వెంటనే ప్రభాస్ చేసిన మొదటి పని స్వామివారిని దర్శించుకొని ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇక చిత్ర పరిశ్రమలో ఎప్పుడు జరగని విధంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈ ఈవెంట్ కోసం అయోధ్యసెట్‌ను వేస్తున్న సంగతి తెల్సిందే.

తాజాగా ఆ సెట్ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. స్టేజిమీద లైట్ల మధ్యలో సెట్ వేసినట్లుగా లేదు. అయోధ్యలోనే మనం ఉన్నామా..? అనేంత ఒరిజినల్‌గా ఈ సెట్‌ను వేశారు ప్రశాంత్ వర్మ. పైన ఆదిపురుష్ పోస్టర్లు.. కింద రామాయణ ఇతిహాసాన్ని తెలియజేసే విధంగా విగ్రహాలను ఏర్పాటు చేశారు. ప్రతి గుడిలో.. రాతి విగ్రహాలను చూస్తూ ఉంటాం. ఇక్కడ అలానే అమర్చారు. ఈ సెట్ చూస్తుంటే.. నిజంగా ఒక రామ మందిరానికి వెళ్ళినట్లే ఉంది అనే ఫీల్ వస్తుంది. ఇక ఈ స్టేజి మీదకు ప్రభ ఎంట్రీ అదిరిపోతోంది. ఇక చిన్న జీయర్ స్వామి ఈ ఈవెంట్‌కు గెస్ట్ గా విచ్చేశారు. ఈ ఈవెంట్ లో డార్లింగ్ స్పీచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read more: ప్రభాస్ నిర్మాతగా సీఎం జగన్ బయోపిక్.. మళ్లీ తెరపైకి షర్మిల ఇష్యూ

Advertisement

Next Story